విజ్ఞాన వీచిక డెస్క్ Wed, 24 Feb 2010, IST
వాస్తువాది గౌరు తిరుపతిరెడ్డి తన 'గౌరువాస్తు' అనే మాసపత్రిక ఆగస్టు 2005 సంచికలో ఇలా సవాల్ విసిరారు.
''మేము వాస్తుకు విరుద్ధంగా ఒక ప్లాన్ ఇస్తాం. ఈ ప్లాన్ ప్రకారం హైదరాబాద్ నుండి ప్రొద్దుటూరుకు వెళ్ళే మెయిన్‌రోడ్డుకు ఇరువైపులా 20కి.మీ. దూరంలోపు గ్రామాలలో మాత్రమే ఇంటిని నిర్మించాలి. ఇలాంటి ఇంట్లో ఐదేళ్లు కాపురం ఉండాలి. ఈ ఐదేళ్లలో ఆ కుటుంబం ఎలాంటి ఒడిదుడుకులకు లోనుకాకుండా జీవించగల్గితే గౌరువాస్తు ప్రకటిస్తున్న రెండు లక్షల రూపాయలు ఆ ఇంట్లో నివసించిన కుటుంబం తీసుకోవచ్చు. అలా జీవించలేకపోతే వారు డిపాజిట్ చేసిన రెండు లక్షల రూపాయలు కోల్పోవలసి వస్తుంది. ''ఆ ప్లానులో ఆయన సూచించిన వాస్తుదోషాలేమిటంటే (1) పశ్చిమ నైరుతిలో గేటు (2) నైరుతిలో నుయ్యి (3) దక్షిణ-పశ్చిమాలలో భూమిలో నీరు నిలువ ఉంచడం. ఈ మూడు దోషాలు మరణాన్ని కలిగిస్తాయని ఆయన పేర్కొన్నారు. ఇలాగే మరికొన్ని వాస్తుదోషాలుగా పేర్కొనబడిన ఇంటిని సూచించారు. వాటి కారణంగా పురుషుల జీవితాలకు ఘోరకలి అనీ, సుదతుల సుఖాలను నలగదంచుతుందనీ, అంతులేని అరిష్టాలొస్తాయనీ అస్పష్ట ఫలితాలు సూచించారు. దానికి నేనిచ్చిన సమాధానాన్ని, దానికి గౌరుగారి సమాధానాన్ని 'గౌరువాస్తు' అక్టోబరు 5లో ప్రచురించారు. నేను నా సమాధానంలో ఇలా పేర్కొన్నాను.
''మీ సవాల్‌లో మీరు సూచించిన వాస్తుదోషం ఉన్న ఇంట్లో ఐదు సంవత్సరాలు 'ఎలాంటి ఒడిదుడుకులకు లోనుకాకుండా జీవించగలిగితే'' రెండులక్షల రూపాయలు ఇస్తామన్నారు. వాస్తును సైన్సుగా మీరు పరిగణిస్తున్నారు. కాబట్టి, మీ సవాలు మరింత శాస్త్రబద్ధంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఏ వాస్తు దోషం కారణంగా ఏకాలంలో ఎటువంటి దుష్ఫలితం వస్తుంది అనే విషయాన్ని మీరు స్పష్టంగా పేర్కొనాలి. అంతేకాని 'ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా' అని అస్పష్టంగా ప్రకటిస్తే ఎలా? ఐదు సంవత్సరాలపాటు ఆ ఇంట్లో ఎవ్వరికీ జలుబులు, దగ్గులు, జ్వరాలు రాకుండా ఉంటాయా? దానిని కూడ మీరు మీ ఒడిదుడుకుల జాబితాలో చేర్చవచ్చుగదా? అందువలన, వాస్తు దుష్ఫలితాలను స్పష్టంగా ప్రకటించండి. అంతేకాదు. 'వాస్తుదోషం' ఉన్న ఇళ్ళవాళ్లు పట్టణాల నుండి, నగరాల నుండి మీ వద్దకు వందల సంఖ్యలో వస్తుంటారు. అలాంటి వారికి నివారణా పద్ధతులు చెప్పకుండా మా జనవిజ్ఞాన వేదిక సభ్యులకు కనీసపు అద్దెకీయమనండి. పైన నేను పేర్కొన్నట్లు 'ఆ ఇళ్ళలోని వాస్తు దుష్ఫలితాన్ని' మీరు స్పష్టంగా పేర్కొనండి. మీ సవాలును ఎదుర్కొనడానికి మా కార్యకర్తలకు మరింత సౌకర్యంగా ఉంటుంది. అంతేకాని హైదరాబాద్-ప్రొద్దుటూరు మెయిన్‌రోడ్డుకు 20 కి.మీ. దూరంగా ఉండే గ్రామంలో ఏ ఉద్యోగస్థుడైనా, వ్యవసాయదారుడైనా ఐదు సంవత్సరాలు ఎలా ఉండగలడు? ఏం పెట్టుకొని తినగలడు? కాబట్టి మీరు మరింత వాస్తవిక దృక్పథంతో విషయాన్ని పరిశీలించి సవాలును విసిరితే, ఆ సవాలును స్వీకరించడానికి జనవిజ్ఞానవేదిక కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తున్నాను.''
నా సమాధానానికి గౌరు తిరుపతిరెడ్డి ప్రతి సమాధానం ఏమిచ్చారో వచ్చే వారం ఇదే శీర్షికలో చదవండి...
- కె.ఎల్.కాంతారావు, (జనవిజ్ఞానవేదిక)
- విశ్వాసాలు.. వాస్తవాలు... 17

విజ్ఞానశాస్త్ర ఫలాలు ముఖ్యంగా నూతన సాంకేతికాల రూపంలో అందుబాటులోకి వస్తున్న సాంకేతిక ఫలాలు సమాజంలోని అన్ని వర్గాలవారికీ, ముఖ్యంగా అణగారిన వర్గాలకూ, పేదలకూ అందాలని మన విజ్ఞాన వీచిక కోరుకుంటుంది. అలానే జనవిజ్ఞాన వేదిక లాంటి ఇతర సంస్థలూ కోరుకుంటున్నాయి. అయితే ఇప్పటి ప్రపంచీకరణలో అదనపు సౌకర్యాల పేరుతో ఆధునిక సాంకేతికాల ద్వారా బహుళజాతి కంపెనీలు మన దేశ వనరులను ప్రజలను, శ్రామికులను దోచుకుంటూ మన ఆర్థిక, సాంఘిక వ్యవస్థలపై పట్టును సాధించుకుంటున్నాయి. ఒకవైపు ఈ సాంకేతికాలు అదనపు ప్రయోజనాలను కలిగిస్తున్నట్లు కనిపిస్తున్పప్పటికీ, అవి కలిగించబోయే నష్టాలను వెంటనే అంచనాకు రాలేకపోతున్నాం. ఉదాహరణకు.. మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో, ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో, పట్టణ మురికివాడల్లో నాణ్యమైన తాగునీటి లభ్యత ఒక సమస్యగా ఉంది. దీనివల్ల అనేకమందికి జబ్బులు వస్తున్నాయి.
ఈజిప్టు దేశంలో ఉన్న పిరమిడ్లు ప్రాచీన ప్రపంచ నాగరికతకు దర్పణం పట్టిన అత్యంత ప్రాముఖ్యతగల నిర్మాణాలు. అయితే ఇవి కళలకుగానీ కళాపోషణకు గానీ సంబంధించిన కట్టడాలు కావు. దాదాపు 138 విడివిడి పిరమిడ్లను సుమారు 850 సంవత్సరాలపాటు వేర్వేరు ప్రాంతాల్లో వేర్వేరు కాలాల్లో నిర్మించారు. క్రీ.పూ. 2630 (క్రీ.పూ.27వ శతాబ్దం)లో మొదటి పిరమిడ్‌ను నిర్మాణం చేశారు. క్రీ.పూ. 2611 సంవత్సరం వరకు దీని నిర్మాణం పూర్తయింది. అంటే దాదాపు 20 సంవత్సరాల పాటు సుమారు 20 వేల మంది శ్రామికులు చెమటోడ్చి పనిచేయడం వల్ల ఈ నిర్మాణాలు పూర్తయ్యాయి. ఆఖరి పిరమిడ్‌ను క్రీ.పూ.1814 సంవత్సరంలో పూర్తి చేశారని చరిత్ర పరిశోధకులు భావిస్తున్నారు.
పిరమిడ్లు నిజానికి ఆనాటి కాలాల్లో అశాస్త్రీయ ఛాందసభావాలతో విరాజిల్లుతున్న పాలకుల సమాధులు. ఈ పాలకుల్ని ఫారోలు (pharaos) అంటారు. ఉదాహరణకు తొలి పిరమిడ్‌ను జోసర్ అనే అనే ఫారోకు సమాధిగా కట్టారు. దీనిని సక్కారా ప్రాంతంలో నిర్మించారు. గ్రేట్ పిరమిడ్‌ను క్రీ.పూ.2530 సంవత్సరంలో గిజా ప్రాంతంలో ఖాఫెర్ అనే ఫారోకు సమాధిగా నిర్మించారు. చివరి పిరమిడ్‌ను మూడవ అమ్మెన్ మాట్ సమాధిగా హవారాలో క్రీ.పూ.1860లో ప్రారంభించి సుమారు 50 సంవత్సరాలకు పూర్తి చేశారు. పిరమిడ్లు అంటేనే గణితం ప్రకారం బహుభుజ ఆధారపీఠం ఉన్న శంఖాకృతులు. అంటే ఆధారపీఠం (base) త్రికోణాకృతి (trigonal)తో గానీ, చతురస్రాకారం (tetragonal)లో గానీ ఉండడం ఆనవాయితి. పార్శ్వభాగాలు ఆధారపీఠంలోని ప్రతి భుజం నుంచి కూచీగా బయలుదేరి పైభాగాన కూచాగ్రం (apex) దగ్గర కలుస్తాయి. అంటే ప్రతి పార్శ్వపు గోడ (side wall) సమద్విబాహు త్రిభుజాకృతి (isosceles triangle) లో ఉంటాయన్నమాట. క్రమంగా పైకెళుతున్న కొద్దీ అడ్డుకోత(transverse cross-section) వైశాల్యం తగ్గుతూ ఉండడం వల్ల పైభాగాన ఉన్న బరువును కింద భాగంలో ఉన్న ఆధారం స్థిరంగా ఉంచుతుంది. స్థిరమైన త్రిమితీయ ఘన ఆకృతు (3-dimensional solid objects) లలో పిరమిడ్లు ప్రముఖమైనవి.
మానవాళికి మేలు చేసిన అతి గొప్ప శాస్త్రజ్ఞుల్లో లూయీపాశ్చర్ మొదటి వరుసలో ఉంటాడు. ఈయన ఫ్రాన్స్ దేశస్థుడు. 1882-95 మధ్య జీవించాడు. ఈయన పరిశోధనా ఫలితాల వల్ల ప్రతిరోజూ ప్రతిఒక్కరూ ఏదో రూపంలో లాభం పొందుతూనే ఉన్నారు. మొట్ట మొదట వ్యాక్సిన్‌ను తయారుచేసింది ఈయనే. రాబిస్, ఆంథ్రాక్స్, మశూచి, కలరా వంటి ప్రమాదకర జబ్బుల కారకాలను కనుగొని, వ్యాక్సిన్‌లను తయారుచేశాడు. ఆధునిక జీవశాస్త్రానికి, బయోకెమిస్ట్రీకి పునాది ఏర్పరిచాడు. పులియటంలో గల శాస్త్రీయతను కనుగొని, వైన్, బీర్‌లాంటి పానీయాల తయారీకి మార్గం చూపాడు. ఈయన పరిశోధనలు విజ్ఞానశాస్త్రం పలుదిశల్లో విస్తరణకు తోడ్పడ్డాయి.
ఇవి ఒకరకమైన సూక్ష్మజీవులు. స్వయంగా పునరుత్పత్తి కాలేవు. కానీ, ఏదైనా జీవకణంలోకి ప్రవేశించినపుడు పునరుత్పత్తి కాగలవు. వీటిలో పునరుత్పత్తికి అవసరమయ్యే పదార్థం (డిఎన్‌ఎ) చుట్టూ మాంసకృత్తుల పూత ఉంటుంది. జీవకణంలో ప్రవేశించి, కేంద్రకంలోకి వెళ్లిన తర్వాత ఇవి పునరుత్పత్తిని ప్రారంభిస్తాయి. కేంద్రకంలోకి ప్రవేశించిన తర్వాత వైరస్ కాపీలు జీవకణం పగిలేంతవరకూ తయారవుతూనే ఉంటాయి. ఇలా జీవకణం పగిలి, విడుదలైన వైరస్‌లు ఇతర జీవకణాలను దాడి చేసి లోపలికి ప్రవేశించి, పునరుత్పత్తిని కొనసాగిస్తాయి. ఈ ప్రక్రియతో వ్యాధి వస్తుంది. కణతులు లేదా గడ్డలు ఏర్పడతాయి. బ్యాక్టీరియాల మాదిరిగా వైరస్‌లను యాంటీబయాటిక్ మందులు చంపలేవు. కానీ, వైరస్ వ్యాధుల వ్యాప్తిని నిరోధించడానికి ఇటీవల టీకా మందులు వచ్చాయి. బలహీనంగా ఉన్న రోగ సూక్ష్మజీవుల నుండి టీకా మందులను తయారు చేస్తు న్నారు. అప్పుడు యాంటీబాడీలు శరీరంలోనే ఉత్పత్తవుతాయి. వైరస్ రోగ వ్యాప్తి నివా రణకు 'గార్డాసిల్, సర్వారిక్స్ టీకా మందులు ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి. వీటిని 'మానవ పాపిలోమా వైరస్ (హ్యూమన్ పాపిలోమా వైరస్)' టీకాలు అంటారు. జలుబు చేసిన సమయంలో వైరస్‌లు దాడి చేసి వ్యాధిని కలిగించవచ్చు. జలుబు ఇబ్బందిని కలిగించినప్పటికీ ఇది తీవ్రమైన వ్యాధి కాదు. జలుబు ముట్టుకోవడం ద్వారా మాత్రమే వ్యాపిస్తుంది. దగ్గడం, తుమ్మడం ద్వారా వ్యాపించదు. జలుబుకు మందు లేదు. రెండొందలకన్నా ఎక్కువ వైరస్‌లు జలుబును కలిగిస్తున్నాయి. జలుబు వచ్చి నప్పుడు ఏ మందు తీసుకోకున్నా మన శరీరంలోనే యాంటీబాడీలు ఉత్పత్తయ్యి వారంరోజుల్లో తగ్గిపోతుంది.